మాడ్రిడ్: స్పెయిన్ అంతటా ప్రధాన మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు పనిచేయకుండా మొరాయించాయి. స్పెయిన్‌లోని నెట్‌వర్క్‌ల ప్రధాన ప్రొవైడర్ డిటెక్టర్, స్పానిష్ టెలికం దిగ్గజం టెలిఫోనికా నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడంతో మొబైల్ వినియోగదారులు ఫోన్‌కాల్స్ చేసుకోలేకపోయారు.
అలాగే సందేశాలు నిలిచిపోయాయి, మొబైల్ డాటాను కూడా వినియోగించుకోలేక పోయారు. టెలిఫోనికా తన నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్న కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఏప్రిల్‌లో స్పెయిన్, ఫోర్చుగల్లలో గ్రిడ్ వైఫల్యం వల్ల దేశవ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే.