న్యూఢిల్లీ: అల్బేనియా ప్రధాని(Albanian PM) ఎది రామా ఓ స్టంట్ క్రియేట్ చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి రెడ్ కార్పెట్‌పై స్వాగతం పలుకుతున్న సమయంలో.. మోకాళ్లపై కూర్చుని మెలోనీకి ఇండియన్ స్టయిల్లో నమస్తే చెప్పారు. అల్బేనియాలోని తిరనాలో జరుగుతున్న యురోపియన్ దేశాల సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. రెడ్ కార్పెట్‌పై నడిచి వస్తున్న మెలోనీ.. అల్బేనియా ప్రధాని స్టంట్ చూసి స్టన్ అయ్యారు. ఆమె తన నవ్వును ఆపుకోలేకపోయారు. లైట్‌గా వర్షం చినుకులు కురుస్తున్న వేళ.. చేతిలో గొడుగుతో వచ్చిన ప్రధాని రామా.. అకస్మాత్తుగా గొడుగును పక్కన పడేసి.. మోకాళ్లపై కూర్చుని.. రెండు చేతులు జోడించి.. మెలోనీకి నమస్తే చెప్పారు. ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
Giorgia Meloni truly commands the utmost respect of world leaders. This is quite the sight to see. pic.twitter.com/xBp3d0Qi7j
— Joey Mannarino 🇺🇸 (@JoeyMannarinoUS) May 16, 2025
ఆరు అడుగుల ఏడు ఇంచులు ఉండే ప్రధాని రామా.. ఇలాంటి స్టంట్ క్రియేట్ ఇదే మొదటిసారి కాదు. గతంలో అబుదాబిలో జరిగిన ఓ సమావేశం సమయంలోనూ మెలోనీ ముందు మోకాళ్లపై అల్బేనియా ప్రధాని కూర్చుని దండం పెట్టారు. అల్బేనియా, ఇటలీ ప్రధానుల మధ్య మంచి అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని రామా వెల్కమ్ పలికిన తీరు పట్ల .. ఆ సమావేశంలో నవ్వులు పూయించాయి. సుమారు 40 మంది యురోపియన్ నేతలు తిరనా భేటీకి హాజరవుతున్నారు. ఉక్రెయిన్‌తో పాటు శరణార్థుల అంశాన్ని ఆ సమావేశాల్లో చర్చించనున్నారు.