గాజా స్ట్రిప్: గాజా సిటీలోని అల్ షిఫా హాస్పిటల్ సమీపంలో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో ఏడుగురు మరణించారు. వీరిలో ఐదుగురు తమ పాత్రికేయులని అల్ జజీరా మీడియా తెలిపింది. దవాఖాన వెలుపల పాత్రికేయుల కోసం వేసిన టెంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, ఈ దవాఖానపై దాడి చేసినట్లు అంగీకరించింది. అల్ జజీరా చెప్పిన ఐదుగురు మృతుల్లో ఒకడైన అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాద సెల్‌కు అధిపతిగా ఉన్నాడని తెలిపింది. అయితే, ఇజ్రాయెలీ బాంబింగ్స్ గురించి ఎక్స్‌లో పోస్ట్ పెడుతుండగా ఇతను మరణించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ముందుగా రాసిన పోస్ట్‌ను అతని ఫ్రెండ్ అతని అకౌంట్ నుంచి పోస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. “నా మాటలు మీకు చేరినట్లయితే, ఇజ్రాయెల్ నన్ను చంపడంలో, నా గొంతును నొక్కడంలో విజయం సాధించిందని తెలుసుకోండి” అని ఈ పోస్ట్‌లో ఉంది. 22 నెలల నుంచి జరుగుతున్న యుద్ధంలో సుమారు 200 మంది మీడియా వర్కర్స్ మరణించారు.