Air Pollution | ప్రతి ఏటా 70 లక్షల మందిని చంపుతున్న వాయు కాలుష్యం: డబ్ల్యూహెచ్‌వో
మానవాళికి వాయు కాలుష్యం( Air Pollution ) అనేది అతిపెద్ద పర్యావరణ ముప్పుల్లో ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: మానవాళికి వాయు కాలుష్యం( Air Pollution ) అనేది అతిపెద్ద పర్యావరణ ముప్పుల్లో ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఏటా 70 లక్షల మంది అకాల మరణం పొందుతున్నారని తన తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. గాలి నాణ్యతను పెంచడం పర్యావరణ మార్పుకు అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుంది. అయితే అది జరగాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించాల్సి ఉంటుంది అని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
ఏటా 70 లక్షల మందిని పొట్టనబెట్టుకుంటున్న వాయు కాలుష్యం.. ఎన్నో కోట్ల మంది ఆరోగ్యవంతమైన జీవితాలపై ప్రభావం చూపుతోంది. పిల్లల్లో ఈ కాలుష్యం ఊపిరితిత్తుల ఎదుగుదలను, వాటి పనితీరును ప్రభావితం చేసి శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లను పెంచుతోంది అని ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో తేల్చి చెప్పింది. గాలి నాణ్యతకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా 2005 తర్వాత తొలిసారి మార్చింది. కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

