Walkway | న్యూఢిల్లీ: ఎడారి నగరం దుబాయ్‌లో ఉక్కపోత నుంచి పాదచారులకు త్వరలోనే ఉపశమనం కలగనుంది. త్వరలోనే ఎయిర్ కండిషన్డ్ నడక మార్గాలు అందుబాటులోకి రాబోతున్నాయి. నగరవ్యాప్తంగా ఈ ఫుట్‌పాత్‌లు ఏర్పాటు కానున్నాయి.
‘దుబాయ్ వాక్’ పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 6,500 కిలోమీటర్ల పరిధిలో ఈ వాక్‌వేలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఏడాది పొడవునా ప్రజలు నడిచేందుకు వీలుగా ఎయిర్‌కండిషనింగ్ ఉంటుంది.