అట్లాంటా: క్యాన్సర్‌ను గుర్తించాలంటే బయాప్సీ పరీక్ష తప్పనిసరి. శరీరానికి కోత కంపల్సరీ. ఇలాంటి బాధలేకుండా బాత్రూంలో కాలకృత్యాలు తీర్చుకొనే క్రమంలో చేసే శబ్దాలతో క్యాన్సర్‌ను నిర్ధ్దారించే సరికొత్త పరికరాన్ని అమెరికాలోని జార్జియా వర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది.
సింథటిక్ హ్యుమన్ అకౌస్టిక్ రీ ప్రొడక్షన్ టెస్టింగ్ (ఎస్హెచ్ఏఆర్టీ) అని నామకరణం చేశారు. బాత్రూంలో మనుషులు చేసే మల, మూత్రవిసర్జన, ఆపానవాయువు శబ్దాలను ఈ పరికరం రికార్డు చేసి, ఏఐ ఆధారంగా విశ్లేషిస్తుంది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను రూపొందించేందుకు పరిశోధకులు ఆరోగ్యకరమైన, క్యాన్సర్ రోగులు బాత్రూమ్లో చేసే మల,మూత్ర విసర్జన, ఆపానవాయువు శబ్దాలు రికార్డ్ చేశారు. ఈ ఆడియో, వీడియో నమూనాలతో డాటాబేస్ రూపొందించారు.