వాషింగ్టన్, జూలై 22: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై కోర్సును రూపొందించేందుకు అమెరికా, భారత్ సహా ఇతర దేశాలు కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైన్స్ సలహాదారు డా.ఆరతి ప్రభాకర్ తెలిపారు. ఏఐ సాంకేతికతను సరైన పద్ధతిలో వినియోగించేందుకు అమెరికాతో కలిసి పని చేసేందుకు ముందుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. ఏఐ వల్ల జరిగే నష్టాలపై సమగ్ర అధ్యయనం చేసి వాటిని నివారించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర ఏడు టెక్ దిగ్గజాలతో బైడెన్ ప్రభుత్వం జట్టుకట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏఐ వల్ల జరిగే నష్టాలను నివారిస్తూనే దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవడంపై టెక్ కంపెనీలతో కలిసి దృష్టి సారించినట్టు తెలిపారు.