దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం దుబాయ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. అయితే 13 గంటలు సుదీర్ఘంగా ప్రయాణించిన తర్వాత తిరిగి దుబాయ్ విమానాశ్రయంలోనే ల్యాండ్ అయ్యింది. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఎమిరేట్స్‌కు చెందిన ఈకే448 విమానం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు దుబాయ్ నుంచి బయలుదేరింది. 9 వేల మైళ్లు ప్రయాణించి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు, వరదల వల్ల ఆక్లాండ్ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాల రాకపోకలను నిలిపివేశారు.
కాగా, ఎమిరేట్స్ విమానం సగం దూరం ప్రయాణించిన తర్వాత ఈ విషయం ఫ్లైట్ సిబ్బందికి తెలిసింది. దీంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. 13 గంటలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత అర్ధరాత్రి వేళ ఆ విమానం తిరిగి దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటనపై ఆక్లాండ్ విమానాశ్రయం అధికారులు విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆదివారం నుంచి విమాన రాకపోకలకు అనుమతించారు. కాగా, వరదల్లో నీట మునిగిన ఆక్లాండ్ విమానాశ్రయం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Auckland Airport has been assessing the damage to our international terminal and unfortunately determined that no international flights can operate today. We know this is extremely frustrating but the safety of passengers is our top priority.
— Auckland Airport (@AKL_Airport) January 28, 2023
Did you know the Auckland airport is the only airport in the world to have an immersive underwater experience in the terminal?
Brilliant architecture! pic.twitter.com/2weSzlMSQd
— STØNΞ | Roo Troop (@MorganStoneee) January 27, 2023