Pegasus Flight: టేకాఫ్‌కు ముందే విమానంలో శిశువుకు జన్మనిచ్చిన మహిళ
Pegasus Flight: పెగాసస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఓ మహిళ ప్రసవించింది. టర్కీ నుంచి ఫ్రాన్స్‌కు టేకాఫ్ తీసుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. మహిళకు నొప్పులు రావడంతో.. విమానాశ్రయంలోని పారామెడిక్స్ ఆమెకు పురుడు పోశారు.
మారిసిల్లే: టర్కీ నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లనున్న విమానంలో ఓ గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది. విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందే ఈ ఘటన జరిగింది. ఫ్రాన్స్‌లోని మారిసిల్లేకు వెళ్లేందుకు విమానం ఎక్కిన మహిళకు అకస్మాత్తుగా నొప్పులు వచ్చాయి. దీంతో ఆ విమానంలో ఉన్న సిబ్బంది తక్షణమే స్పందించారు. సబిహ గోకెన్ విమానాశ్రయంలో ఉన్న పారామెడిక్స్ ఆ మహిళను మరోసీటుకు తరలించి పురుడు పోశారు. పెగాసస్ ఎయిర్‌లైన్స్ విమానం(Pegasus Flight)లో ఈ ఘటన జరిగింది. చివరకు ఓ మహిళా పారామెడిక్.. విమానం నుంచి బేబీని పట్టుకువచ్చింది. ప్రిమాచూర్ బేబీగా డాక్టర్లు గుర్తించారు. ఆ శిశువును తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఇటీవల ఓ మహిళ విమానంలో బత్రూమ్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈక్వెడార్ నుంచి అమస్టర్‌డ్యామ్ వెళ్తున్న కేఎల్ఎం రాయల్ డచ్ విమానంలో ఆ ఘటన జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

