కాలిఫోర్నియా, డిసెంబర్ 25: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను కలిగిన ‘చాట్ జీపీటీ’లో త్వరలో అడ్వర్టయిజ్మెంట్స్ను కూడా తీసుకొస్తున్నట్టు తెలిసింది. ఏఐ వేదికల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోనేందుకు ‘ఓపెన్ఏఐ’ కసరత్తు చేస్తున్నది.
కొన్నేండ్లుగా యాడ్స్ లేకుండా సేవల్ని అందిస్తున్న ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్‌లో చాట్‌జీపీటీ ప్రత్యేకంగా నిలుస్తున్నది. అయితే ఇకపై దాని ఇంటర్‌ఫేస్‌పై కొత్తగా యాడ్స్ దర్శనమివ్వబోతున్నాయి. ఇందుకు సంబంధించి ‘ఓపెన్ఏఐ’ అంతర్గత చర్చలు జరుపుతున్నట్టు ‘ద ఇన్ఫర్మేషన్’ నివేదిక పేర్కొన్నది.