హాంకాంగ్, జూలై 31: అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించే సాహసికుడు, డేర్డేవిల్గా పేరున్న ఫ్రాన్స్‌కు చెందిన రెమీ లుసిడి(30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గత వారం హాకాంగ్లోని ఓ ఎత్తైన భవనాన్ని ఎక్కే క్రమంలో పట్టు తప్పి కింద పడి అతను మరణించినట్టు భావిస్తున్నట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు చేసిన పోలీసులు.. అతను రూఫ్‌టాప్ పైనుంచి పడివుంటాడని పేర్కొన్నారు. ఘటనాస్థలిలో అత్మహత్య లేఖ ఏమీ కనిపించలేదని, పోస్టుమార్టం అనంతరం మరణానికి గల కారణంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. లుసిడీ చివరిగా భవనం 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్ కిటికీని కొడుతూ కనిపించాడని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.