వాషింగ్టన్, ఆగస్టు 7: భారతీయ అమెరికన్ టీనేజర్ ఆర్య వాల్వేకర్ మిస్ ఇండియా యూఎస్ఏ-2022 కిరీటాన్ని దక్కించుకున్నారు. 18 ఏండ్ల ఈ యువతిది వర్జీనియా రాష్ట్రం. న్యూజెర్సీలో నిర్వహించిన ఈ పోటీల్లో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ప్రీ మెడికల్ సెకండియర్ విద్యార్థిని సౌమ్యశర్మ ఫస్ట్ రన్నరప్‌గా, న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. వాషింగ్టన్ రాష్ర్టానికి చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని, న్యూయార్క్‌కు చెందిన తన్వీ గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్నారు. అమెరికాలోని 30 రాష్ర్టాలకు చెందిన 74 మంది అభ్యర్థులు మూడు వేర్వేరు విభాగాల్లో పోటీ పడ్డారు.