హనోయ్, సెప్టెంబర్ 28: చేతి గోర్లు పెంచటంలో వియత్నాంకు చెందిన ఓ కళాకారుడు సరికొత్త రికార్డ్ సృష్టించాడు. గత 34 ఏండ్లుగా తన గోర్లు కత్తిరించుకోకుండా.. వాటిని పెంచుతూ వస్తున్న లూ కాంగ్ హుయేన్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతి గోర్ల మొత్తం పొడవు 6 మీటర్లకు చేరుకుంది.
ఇది ఒక సగటు జిరాఫీ ఎత్తుకన్నా ఎక్కువ. రాయల్‌గా, వినూత్నంగా కనిపించేందుకు తాను గోర్లు పెంచటం మొదలుపెట్టానని లూ కాంగ్ తెలిపాడు. గోరు కత్తిరించటమనే ఆలోచనే తనకు రాదని, అలాగే తనకు పెయింటింగ్ హాబీ కూడా ఉందని లూ కాంగ్ చెప్పుకొచ్చాడు.