వాషింగ్టన్: ఒంటరితనం అనేది గుండె సంబంధ వ్యాధులకు కారణం కావొచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఒక వ్యక్తి ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండటం, తనకు ఎవరూ లేరన్న భావనతో ఏకాకి జీవితాన్ని గడపటం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయని అధ్యయనం వెల్లడించింది.
ముఖ్యంగా ఒంటరితనం ఆలోచనలు గుండెపై నేరుగా ప్రభావం చూపుతాయని తెలిపింది. ఇందుకు సంబంధించిన అధ్యయనం ‘జాక్’ అనే జర్నల్లో ప్రచురితమైంది.