ఫిలడెల్ఫియా: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో సినీఫక్కీలో చోరీ జరిగింది. మాస్కులు ధరించిన వందల మంది సామూహిక దోపిడికి పాల్పడ్డారు. సెంట్రల్ సిటీలోని స్టోర్లలో దూరిన యువతీ యువకులు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఐఫోన్లు, ఐప్యాడ్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వారిలో కొంతమందిని పట్టుకున్నారు. వారి నుంచి ఐఫోన్లు, ఐప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు.