న్యూయార్క్, జూలై 28: అమెరికాలో ప్రస్తుతం ఉన్నవి రెండే పార్టీలు. ఒకటి అధికార డెమొక్రటిక్ పార్టీ, రెండోది.. రిపబ్లికన్ పార్టీ. ఈ రెండు పార్టీల మధ్యే అధికారం చేతులు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా అమెరికా గడ్డపై కొత్త పార్టీ అవతరించబోతున్నది. ‘ఫార్వర్డ్’ పేరుతో మాజీ రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కలిసి కొత్త పార్టీని స్థాపించనున్నారు. సెప్టెంబర్ 24న పార్టీని ప్రారంభించనున్నారు.