కెనడాలో వింత వ్యాధి.. యువతలోనే ఎక్కువ
Canadian whistleblower | హవానా సిండ్రోమ్, సూడాన్ డిసీజ్‌లపై ఇంకా ఒక స్పష్టత రాకముందే, కెనడాలో మరో వింతవ్యాధి ప్రబలుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. యువతకే ప్రధానంగా సోకుతున్నదని అంటున్నారు. ఈ కొత్తవ్యాధి

న్యూఢిల్లీ: హవానా సిండ్రోమ్, సూడాన్ డిసీజ్‌లపై ఇంకా ఒక స్పష్టత రాకముందే, కెనడాలో మరో వింతవ్యాధి ప్రబలుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. యువతకే ప్రధానంగా సోకుతున్నదని అంటున్నారు. ఈ కొత్తవ్యాధి సోకినవారి గ్రహణేంద్రియాలు పనిచేయడం మానేస్తాయని వైటాలిటీ మెడికల్ నెట్‌వర్క్‌కు చెందిన ఓ ఉద్యోగి బయటపెట్టారు. గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని కౌమారుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. వేగంగా బరువును కోల్పోవడం, నిద్ర పట్టకపోవడం, ఆలోచనా శక్తి, కదలికలు తగ్గిపోవడం వంటివి వ్యాధి లక్షణాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
గత ఏడాది ఈ వ్యాధి గురించి వెల్లడైంది. ఈ వ్యాధి ఎక్కువగా ఉన్న కెనడాలోని బ్రన్స్విక్ రాష్ట్రంలో రోగుల సంఖ్య 48 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. ఆ సంఖ్య నిజానికి 150 దాటిందని కొందరు అంటున్నారు. ఇతర ప్రాంతాల్లో అజ్ఞాతంగా వ్యాధి ప్రబలుతూ ఉండొచ్చని కూడా వినిపిస్తున్నది. పర్యావరణ కారణాల వల్ల ఈ వింతవ్యాధి ప్రబలుతున్నట్టు చర్చ జరుగుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

