Viral video: అప్పులు తీర్చేందుకు టాయిలెట్ పేపర్ వాడకం మానేసింది!!
వెస్ట్రర్న్ కంట్రీస్‌లో మరుగుదొడ్డిలో టాయిలెట్ పేపర్ కంపల్సరీ. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి అది అత్యవసర వస్తువు. కరోనా లాక్డౌన్ సమయంలో అమెరికా, ఫ్రాన్స్‌లో స్టోర్ల ఎదుట టాయిలెట్ పేపర్‌కోసం పెద్ద ఎత్తున క్యూకట్టారు. ఇందుకోసం వారు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. కాగా, ఓ ముగ్గురు పిల్లలున్న తల్లి తన కుటుంబ అప్పులు తీర్చేందుకు టాయిలెట్ పేపర్ వాడకాన్ని మానేసింది. వాటికి ఖర్చు చేసే డబ్బులను సేవ్ చేసి, కొన్ని అప్పులు తీర్చేసింది. దీనికి సంబంధించి ఆమె ఓ వీడియో చేయగా, నెట్టింట వైరల్‌గా మారింది.

అంబర్ అల్లెన్ అనే మహిళ ‘ది ఫెయిర్లీ లోకల్ ఫ్యామిలీ’ అనే యూట్యూబ్ చానల్ రన్ చేస్తున్నది. ఆమెకు ముగ్గురు పిల్లలు. 70వేల డాలర్ల అప్పుంది. అయితే, ఈ అప్పు తీర్చేందుకు నెలవారీ ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం టాయిలెట్ పేపర్ల వాడకాన్ని మానేసింది. వాటి బదులు పాత బట్టలు వాడడం ప్రారంభించింది. ఇలా 2,100 డాలర్లు సేవ్ చేసి, అప్పుల భారం కొంత తగ్గించుకున్నది. ఈ విషయంపై ఆమె తన యూట్యూబ్ చానల్లో వీడియో చేసి పెట్టగా, చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 59వేల మంది వీక్షించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Case | బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడికి మరణ శిక్ష.. మీరట్ కోర్టు సంచలన తీర్పు
India vs West Indies | హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
Palamuru-Rangareddy Project | మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
Horoscope | 15-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
KTR | కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?