కంటైనర్ నౌక ఢీకొనడంతో నదిలోని ఒక భారీ వంతెన రెండు ముక్కలై పాక్షికంగా కూలిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బ్రిడ్జిపై ఉన్న పలు వాహనాలు నీటిలో పడటంతో ఐదుగురు మృతి చెందారు.
చైనాలోని గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఖాళీగా వెతున్న ఒక రవాణా నౌక లిజింగ్షా వంతెన స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. దీంతో బ్రిడ్జిలోని కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో బ్రిడ్జిపై ఉన్న ఒక బస్సు, మోటారు సైకిల్ సహా ఐదు వాహనాలు కింద నీటిలో పడ్డాయి. ఐదుగురు మరణించారు.