శనివారం 31 అక్టోబర్ 2020
International - Oct 07, 2020 , 06:29:03

చైనాపై చతుర్ముఖ వ్యూహం

చైనాపై చతుర్ముఖ వ్యూహం

టోక్యో: విస్తరణవాదంతో విర్రవీగుతూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అశాంతిని రాజేస్తున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. చైనా దూకుడును అడ్డుకొని ఇండో-పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా నిలిపేందుకు ఈ నాలుగు దేశాల విదేశాంగమంత్రులు మంగళవారం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జపాన్‌ కొత్త ప్రధాని యొషిహిడే సుగా, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా సంక్షోభంకన్నా తమకు ప్రస్తుతం ఇండో-పసిఫిక్‌లో శాంతి సుస్థిరతలే అత్యంత కీలకమని స్పష్టంచేశారు. మంగళవారం ఉదయం అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రులు ఎస్‌ జైశంకర్‌, తొషిమిట్సు మొటెజి, మరైస్‌ పేన్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్‌ మాట్లాడుతూ వైభవోపేతమైన, బహుళత్వం కలిగిన మన ప్రజాస్వామ్య దేశాలు ఇండో-పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.