వాషింగ్టన్: అమెరికాలో ఉండే భారత సంతతి కుటుంబం కొండపై నుంచి 300 అడుగుల లోతైన లోయలోకి పడినా అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భార్యా బిడ్డలను చంపేందుకు కుటుంబ యజమాని ఈ పని చేశాడని భావించిన పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం శాన్ మాటియో కౌంటీలోని ప్రమాదకరమైన డెవిల్స్ ైస్లెడ్ రహదారిలో కారు అదుపుతప్పి లోయలో పడిందని సోమవారం అధికారులకు సమాచారం అందింది. అధికారులు వెంటనే హెలికాప్టర్ సహాయంతో నలుగురిని బయటకు తీసి దవాఖానకు తరలించారు. వీరిలో ఆలుమగలతోపాటు నాలుగేండ్ల బాలిక, తొమ్మిదేండ్ల బాలుడు ఉన్నారు. బాధితులు భారత సంతతికి చెందిన 41 ఏండ్ల ధర్మేశ్ ఏ పటేల్ కుటుంబంగా గుర్తించారు.