మనుషులు కోతినుంచి వచ్చాడని అంటుంటారు. చాలామంది దీన్ని నమ్ముతారు. ఎందుకంటే కోతులు, వాటి వర్గానికి చెందిన చింపాంజీల ప్రవర్తన చూస్తే అలాగే అనిపిస్తుంటుంది. ఇవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తుంటాయి. చింపాంజీలు అరటిపండును మనిషిలాగే తొక్క ఒలుచుకుని దర్జాగా తింటుంటాయి. బాధ కలిగినప్పుడు చాతీని బాదుకుంటూ ఏడుస్తుంటాయి. అయితే, ఓ చింపాంజీ అడుగు ముందుకేసి జీవితాన్ని అచ్చం మనిషిలా ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది.
ఈ వీడియోను క్రియేచర్ అరెనా అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో చింపాంజీ టోపీ, సన్‌గ్లాసెస్ ధరించింది. వైన్గ్లాసులో పోసిన మిల్క్‌షేక్‌ను కాలు మీద కాలేసి కూల్‌గా తాగుతూ కనిపించింది. కింద నీళ్లలో కాళ్లు ఆడిస్తూ మిల్క్‌షేక్‌ను ఆస్వాదిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇప్పటివరకూ లక్షకుపైగా వీక్షణలను సొంతం చేసుకున్నది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.
Cool …👑 pic.twitter.com/s8z0p9y9OE
— Creature Arena (@CreatureArena) September 2, 2022