జీన్థెరపీతో వినికిడి శక్తి పునరుద్ధరణ
జన్యుపరమైన సమస్యలతో వినికిడి లోపంతో జన్మించిన బ్రిటన్కు చెందిన ఎనిమిది నెలల చిన్నారికి జీన్ థెరపీతో వినికిడి శక్తిని పునరుద్ధరించారు వైద్యులు. ఓపల్ సాండీ అనే చిన్నారికి కేంబ్రిడ్జ్లోని అడ్డెన్బ్రూక్స్ హాస్పిటల్కు చెందిన వైద్యులు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
- ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్ బాలికకు విజయవంతంగా చికిత్స
లండన్, మే 12: జన్యుపరమైన సమస్యలతో వినికిడి లోపంతో జన్మించిన బ్రిటన్కు చెందిన ఎనిమిది నెలల చిన్నారికి జీన్ థెరపీతో వినికిడి శక్తిని పునరుద్ధరించారు వైద్యులు. ఓపల్ సాండీ అనే చిన్నారికి కేంబ్రిడ్జ్లోని అడ్డెన్బ్రూక్స్ హాస్పిటల్కు చెందిన వైద్యులు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఎలాంటి వినికిడి పరికరం అవసరం లేకుండానే ఈ చిన్నారి వినగలుగుతున్నదని వైద్యులు తెలిపారు.
ఈ అధునాతన చికిత్స అందుకున్న ప్రపంచంలోనే మొదటి వ్యక్తి ఈ చిన్నారి. చికిత్సలో భాగంగా ముందు చిన్నారి ఎడమ చెవిలోని కోక్లియా(కర్ణావృత్తి)కి జనరల్ అనెస్తీసియా ఇచ్చారు. తర్వాత వినికిడి శక్తిని పునరుద్ధరించగలిగే జన్యు పదార్థం నకలుతో కూడిన ప్రమాదరహిత ఏఏవీ1 అనే వైరస్ను ఆమెకు ఇచ్చారు. ఈ వైరస్ శరీరంలోని కణాలకు జన్యు పదార్థాన్ని సరఫరా చేసి శరీరం నుంచి సహజంగా నిష్క్రమిస్తుంది. ఆ జన్యు పదార్థం వినికిడి శక్తిని పునరుద్ధరించేలా చేస్తుంది. ఈ చికిత్స పూర్తిగా సురక్షితమైనదని వైద్యుడు మనోహర్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

