ఒట్టావా, ఏప్రిల్ 29: మూడు రోజుల క్రితం ఒట్టావా ప్రావిన్స్‌లో కన్పించకుండా పోయిన 21 ఏండ్ల భారతీయ విద్యార్థిని శవమై కన్పించింది. పంజాబ్ ఆప్ నేత దేవీందర్ సింగ్ కుమార్తె అయిన వంశిక రెండున్నరేండ్ల క్రితం డిప్లమో విద్యనభ్యసించడానికి కెనడా వెళ్లింది.
ఒట్టావాలోని 7 మెజిస్టిక్ డ్రైవ్‌లో ఉన్న ఇంటి నుంచి అద్దె గదిని చూడటానికి శుక్రవారం రాత్రి 8-9 గంటల మధ్య బయటకు వెళ్లింది.అయితే ఆమె మూడు రోజుల తర్వాత స్థానికంగా ఉన్న ఒక బీచ్‌లో శవమై కన్పించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.