Iran Blast : ఇరాన్‌ను జంట పేలుళ్లు నిలువునా వణికించాయి. ఇరాన్లో బుధవారం జరిగిన భారీ పేలుళ్లలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 170మంది గాయపడ్డారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఖుద్స్ ఫోర్స్‌కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమాని సంస్మరణ సభలో ఈ దుర్ఘటన జరిగింది.
పేలుళ్లకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులే జంట పేలుళ్లకు తెగబడటంతో ఇరాన్ నెత్తురోడింది. ఇది ఉగ్రమూకల దుశ్చర్యేనని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది.
ఈ ఘటనలో 100 మందికి పైగా 170 మందికి గాయాలయ్యాయని ఇరాన్ అత్యవసర సేవల ప్రతినిధి బబక్ యకపరస్ తెలిపారు. కాగా, గాయపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Read More :