Louisiana | అమెరికా (America) లోని లూసియానా (Louisiana) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు (Superfog) కారణంగా వందలాది కార్లు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సుమారు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో వాహనదారులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
న్యూ ఓర్లానోలోని పాంట్ చార్ట్రెయిన్ సమీపంలో గల ఇంటర్‌స్టేట్ -55 రహదారిపై సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 158కిపైగా వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి. సుమారు 30 నిమిషాల పాటు వాహనాలు ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు స్థానిక మీడియా నివేదించింది. మరోవైపు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకోవడంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సుమారుగా 25 మందికిపైగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఊహించని ఈ ఘటనతో రహదారిపై దాదాపు 11 మైళ్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనలో కార్లు తుక్కుతుక్కుకాగా, పలు వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా, అమెరికాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదేమీ మొదటి సారి కాదు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. పొగమంచు, మంచు తుఫాను, కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగవల్ల వందలాది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్న ఘటనలు ఇప్పటికే చాలా చోటు చేసుకున్నాయి.
massive #pileup in #Louisiana More than 150 cars collided on the bridge. near #NewOrleans. One of the cars flew off the bridge into the river during the accident, but the driver managed to escape. Many cars have caught on fire
severe fog caused by blazing swamps likely cause pic.twitter.com/DVI7nuXpjz— Arthur Morgan (@ArthurM40330824) October 24, 2023
🚨#BREAKING: Hazardous Dense Fog mixed with Smoke has Cause a Catastrophic 25+ Vehicle Pileup with Multiple Injuries and Fatalities
Currently, Numerous emergency personnel and other authorities are on the scene to a significant vehicle pileup occurring… pic.twitter.com/TaiVV1P9Fb
— R A W S A L E R T S (@rawsalerts) October 23, 2023
NEW: Approximately 25 crashes involving a total of 75 to 150 vehicles occurred in both directions of Interstate 55 in #Louisiana due to super #fog. pic.twitter.com/8QvPDpazuY
— Insider Corner (@insiderscorner) October 23, 2023
‘Superfog’ kills at least seven people in #Louisiana, USA.
A 158-car pile-up has been caused by dense morning fog, worsened by nearby marsh fires.
The wreckage on Interstate 55, close to New Orleans, shows dozens upon dozens of crushed & scorched vehicles. pic.twitter.com/qjrSbLRmgN
— Michael Ashura (@MichaelAshura) October 24, 2023
Also Read..
Sri Lanka | శ్రీలంక కీలక నిర్ణయం.. భారత్ సహా 7 దేశాల టూరిస్ట్‌లకు వీసా ఫ్రీ ఎంట్రీ
ODI World Cup | పాక్‌పై ఘన విజయం.. లుంగి డ్యాన్స్‌తో అదరగొట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు.. VIDEO