ODI World Cup | పాక్‌పై ఘన విజయం.. లుంగి డ్యాన్స్‌తో అదరగొట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు.. VIDEO
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్వితీయ విజయాన్ని నమోదు చేసుకుంది. పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఓడీఐస్లో తొలిసారి పాక్ జట్టును ఓడించి ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. దీంతో ఈ విజయాన్ని ఆఫ్ఘన్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్వితీయ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan).. తాజాగా పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను చిత్తు చేసింది. సోమవారం చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఓడీఐస్లో తొలిసారి పాక్ జట్టును ఓడించి ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. దీంతో ఈ విజయాన్ని ఆఫ్ఘన్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా కొన్ని దేశీ బీట్స్‌కు కాలు కదిపి సందడి చేశారు. మ్యాచ్ అనంతరం మైదానం నుంచి బస్సులో వెళ్తున్న సమయంలో.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంలోని ‘లుంగి డ్యాన్స్ ’ (Lungi Dance) పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఆఫ్ఘనిస్థాన్ అక్టోబర్ 30న పుణె వేదికగా జరగబోయే తన తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.
కాగా, సోమవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. పాక్ స్పిన్, పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 49వ ఓవర్లో షాహిన్ షా అఫ్రిది వేసిన చివరి బంతిని హస్మతుల్లా బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి పంపి విన్నింగ్ షాట్ కొట్టారు. తొలుత పాకిస్థాన్ భారీగానే పరుగులు చేసినా.. తదుపరి బ్యాటింగ్ కు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ ను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు విఫలం అయ్యారు.
Afghanistan players dancing in the team bus with “Lungi dance song”. 🇦🇫
– Amazing moments in World Cup.pic.twitter.com/JiNKUCJG1W
— Johns. (@CricCrazyJohns) October 24, 2023
🔥🔥🔥 #Afghanistan #AFGvsPAK pic.twitter.com/XMEfqVth5d
— RaWat (@RaWat175188) October 24, 2023
Also Read..
ODI World Cup | పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ విజయం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

