మెక్సికో సిటీ: మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.1గా నమోదయిందని నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో రిసార్టుకు 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ఈ శక్తిమంతమైన భూకంపం ధాటికి దాదాపు 200 మైళ్ల దూరంలో ఉన్న మెక్సికో నగరంలో ఇండ్లు, భవనాలు ఊగిపోయాయి. సుమారు ఒక నిమిషానికి పైగా భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కొన్ని చోట్ల భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు.
కాగా, మెక్సికోలో 1985, సెప్టెంబర్ 19న 8.1 తీవ్రతతో భూమి కంపించిందని, దీనివల్ల 10 వేలకుపైగా మంది మరణించారని, వేల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయని వెల్లడించారు. 2017లో 7.1 తీవ్రతతో భూమి కంపించింది. అప్పుడు 370 మంది మరణించారు.
JUST IN 🚨 Power flashes seen in Mexico as powerful earthquake hits the city. pic.twitter.com/9CmURK3tzm
— Insider Paper (@TheInsiderPaper) September 8, 2021
A M7.0 quake occurred near Acapulco tonight. The location and focal mechanism are consistent with being part of the plate boundary where the Cocos plate is goin under the North American plate. M7 is smaller than many subduction zones, but common in the Mexico subduction zone
— Dr. Lucy Jones (@DrLucyJones) September 8, 2021