కాఠ్మండు, నవంబర్ 9: హిమాలయ దేశం నేపాల్‌లో భూకంపం సంభవించింది. పశ్చిమ ప్రాంతంలోని దోతి జిల్లాలో ఆరుగురు మరణించారు. ముగ్గురు గల్లంతయ్యారు. మంగళవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. ఎన్నికల ప్రచారం కోసం పశ్చిమ ప్రాంతంలోని ధన్గధి జిల్లాలో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దూబే క్షేమంగానే ఉన్నారు. ఈ జిల్లాలోనూ చిన్నపాటి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సహాయ చర్యల్లో సైనికులు పాల్గొంటున్నారు. మరోవైపు ఢిల్లీతోపాటు ఘజియాబాద్, గురుగ్రామ్, లక్నోలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.