జకార్తా: ఇండోనేషియాలోని (Indonesia) తైమూర్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2.34 గంటలకు తైమూర్ దీవులకు (Timor Island) సమీపంలోని కుపాంగ్లో భూమి కంపించింది. దీని తీవ్రత 6.1గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. పశ్చివ నుసా టెంగారా ప్రావిన్స్ రాజధాని కుపాంగ్కు (Kupang) 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ముప్పు లేదని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ పేర్కొంది.
అర్ధరాత్రి వేల భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ఇండ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, 6.6 తీవ్రతతో భూమి కంపించిందని ఇండోనిషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) తెలిపింది.
Earthquake of Magnitude:6.1, Occurred on 02-11-2023, 02:34:45 IST, Lat: -10.29 & Long: 123.79, Depth: 10 Km ,Location:Dili, Timor-Leste for more information Download the BhooKamp App https://t.co/PPWzYr7wxQ @KirenRijiju @moesgoi @Dr_Mishra1966 @Ravi_MoES @Indiametdept @ndmaindia pic.twitter.com/CFNUYGGDvZ
— National Center for Seismology (@NCS_Earthquake) November 1, 2023