California | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరోసారి తూటా పేలింది. కాలిఫోర్నియా (California)లోని ఆరెంజ్ కౌంటీ (Orange County)లో గల ఓ బార్లో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికంగా ఉన్న బైకర్స్ బార్ (Bikers Bar)లో బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సహా 5 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు గాయపడినట్లు వెల్లడించారు. నిందితుడు రిటైర్డ్ పోలీసు అధికారి అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. భార్య తనను దూరం పెడుతోందన్న కోపంతో.. ఆమెను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులకు తెగబడినట్లు పేర్కొంది.
Also Read..
Joe Biden | ప్రిగోజిన్ మృతి.. బైడెన్ ఏమన్నారంటే..?
Chandrayaan-3 | చంద్రుడిపై భారత్ అడుగులు మొదలయ్యాయి : ఇస్రో ట్వీట్
Gas Leakage | విషవాయువు పీల్చి 28 మందికి అస్వస్థత