మాస్కో, అక్టోబర్ 17: పిల్లలను కనకుండా ప్రజలను నిరుత్సాహపరిచే వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు రష్యా సిద్ధమైంది. ఇలాంటి వారికి భారీగా జరిమానా విధించే బిల్లుకు రష్యా దిగువ సభ గురువారం ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌తో పారాటం, దేశంలో జననాల సంఖ్య తగ్గిన క్రమంలో ఈ బిల్లు ప్రవేశపెట్టినట్టు సభ్యులు తెలిపారు. ఈ బిల్లు అధ్యక్షుడు పుతిన్‌కు తుది ఆమోదానికి పంపే ముందు స్టేట్ డుమా, ఎగువ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ చట్టం ప్రకారం.. పిల్లలు కనకుండా ప్రోత్సహించే ప్రచారాన్ని వ్యాప్తి చేయడం నేరంగా పరిగణిస్తారు. దీనికి సుమారు రూ.42 లక్షలు జరిమానా విధిస్తారు.