kazakhstan | మాస్కో : అజర్బైజాన్ విమానం కూలిన ప్రమాదంలో 40 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. ప్రయాణికులలో 37 మంది అజర్బైజాన్ వాసులు, 16 మంది రష్యన్లు, ఆరుగురు కజకిస్థానీలు, ముగ్గురు కిర్గిస్థానీ పౌరులు ఉన్నారు. అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి బయల్దేరిన విమానాన్ని పొగమంచు కారణంగా కజకిస్థాన్‌లోని అక్టౌ విమానాశ్రయానికి మరలించారు. విమానం దానికి దగ్గర్లో ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షి ఢీకొనడంతో కుప్ప కూలి మంటలు చెలరేగాయి.