మాస్కో: రష్యా (Russia) రాజధాని మాస్కోలోని (Moscow) ఓ షాపింగ్ మాల్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. మాస్కోలోని ద సీజన్స్ (The Seasons) అనే షాపింగ్ మాల్లో (Shopping mall) ఒక్కసారిగా వేడి నీటి పైప్‌లైన్ పగిలిపోయింది (Hot water pipe burst). దీంతో నలుగురు మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారని నగర మేయర్ సెర్జీ సోబ్యానిన్ (Mayor Sergei Sobyanin) తెలిపారు.
Mascow
చాలామంది కాలిన గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించామన్నారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని వెల్లడించారు. అయితే పైపు పేలిన తర్వాత అమ్మోనియా లీక్ (Ammonia leak) కాలేదని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. కాగా, సీజన్స్ షాపింగ్ మాల్‌ను 2007లో ఓపెన్ చేశారు. అందులో 150 స్టోర్లు ఉన్నాయి.
ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా దురాక్రమణ కొనసాగుతూనే ఉన్నది. ఖార్కివ్ (Kharkiv) రీజియన్‌లో రష్యా సైనికులు క్షిపణుల (Shelling) వర్షం కురిపించడంతో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.