శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని బండీపురా జిల్లాలో శనివారం అదుపు తప్పిన సైనిక ట్రక్ కొండపై నుంచి దొర్లిపడడంతో నలుగురు జవాన్లు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు.
సదర్ కూట్ పయన్ సమీపంలో మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాగా, డిసెంబర్ 24న పూంచ్ జిల్లాలో ఓ సైనిక వాహనం 350 అడుగుల లోతైన లోయలో దొర్లిపడిన ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించగా మరో ఐదుగురు గాయపడిన విషయం తెలిసిందే.