Erectile dysfunction | బీజింగ్, మార్చి 8: నపుంసకత్వం (ఎరెక్టిల్ డిస్ఫంక్షన్) సమస్యతో బాధపడుతున్న పురుషులకు శుభవార్త. ఎట్టకేలకు ఈ సమస్యకు శాస్త్రవేత్తలు శాశ్వత పరిష్కారాన్ని కనుగొన్నారు. గ్వాంగ్జౌలోని సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు 3డీ ప్రింటెడ్ పురుషాంగ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేశారు.
అంగ స్తంభనలో కీలకంగా వ్యవహరించే కార్పస్ కెవర్నోసమ్ అనే కణజాలాన్ని వృద్ధి చేశారు. ఇది సుమారుగా 2.46 అంగుళాలు ఉంటుంది. అధ్యయనంలో భాగంగా ఈ 3డీ ప్రింటెడ్ ఇంప్లాంట్‌ను పదుల సంఖ్యలో పందులు, కుందేళ్లపై ప్రయోగించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. పురుషాంగ కణాలు దెబ్బతిన్న పందుల్లో అంగస్తంభన జరగడమే కాదు, సంతానోత్పత్తిలోనూ మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఈ ఇంప్లాంట్‌ను అమర్చకముందు పందుల్లో సంతానోత్పత్తి రేటు 20 శాతం వరకు ఉండగా.. అమర్చాక 100 శాతానికి పెరిగింది.