రోమ్: సుమారు 39.4 మీటర్ల పొడుగు ఉన్న విలాసవంతమైన నౌక ఇటలీ తీరంలో మునిగింది. ఆ నౌక ఖరీదు సుమారు 8 మిలియన్ల డాలర్లు ఉంటుంది. ఐయోనియా సముద్రంలో ఆ నౌక బోల్తా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఇటలీ కోస్టుగార్డులు రిలీజ్ చేశారు. మై సాగా పేరున్న ఈ నౌక గల్ఫ్ ఆఫ్ క్విల్లేస్ వద్ద నీట మునిగింది. ఆ నౌకలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. ఎవరూ గాయపడలేదు. అయితే టగ్ బోటుతో ఆ నౌకను తీరానికి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వెస్ట్రన్ టర్కీలోని గల్లిపోలి నుంచి సిసిలీలో మిలాజో దిశగా వెళ్తున్న సమయంలో పడవ బోల్తాపడింది. ఈ నౌకను టిమ్ హేవుడ్ డిజైన్ చేశారు.