Wildfires | అమెరికాలోని హవాయి (Hawaii) ద్వీపంలో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తోంది. అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం (Maui island) అల్లకల్లోలంగా మారింది. మంటలు చుట్టుముడుతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మంటలు, పొగ ధాటికి తట్టుకోలేక పలువురు సముద్రంలోకి (Ocean) దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి ఈ కార్చిచ్చు వ్యాపిస్తున్నట్లు మౌయి కౌంటీ (Maui County) వెల్లడించింది. కార్చిచ్చుకు తోడు హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతో, మావీయ్లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు కాలి బూడిదైనట్లు చెప్పారు. దావాగ్ని చుట్టుముట్టిన పరిస్థితుల కారణంగా అధికారులు 16 రోడ్లను మూసివేశారు. ప్రస్తుతం ఒకే ఒక్క హైవే మాత్రమే అందుబాటులో ఉడటంతో.. ఆ మార్గం గుండా వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కార్చిచ్చు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హవాయి ద్వీపంలో ఇప్పటికే అత్యవసర ప్రతిస్పందనా బృందాలు సహాయక చర్యలు చేపడుతుండగా ఆర్మీ, నేవీ కూడా రంగంలోకి దిగాలని బైడెన్ ఆదేశించారు. మరోవైపు నివాసితులంతా తరలింపు ఆదేశాలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచనలను పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
🚨 JUST IN: Death toll from Maui, Hawaii fires has reached 36
The town of Lahaina looks absolutely apocalyptic. There is practically nothing left.
Winds from a distant hurricane fanned the flames of a wildfire, engulfing the resort town with very little warning.
People fled… pic.twitter.com/sHLVcCxaiv
— Nick Sortor (@nicksortor) August 10, 2023
🇺🇸 At least 36 people have #died in "unprecedented" #wildfires raging across the #Maui and #Hawaiifire #US #USA #America #breaking #breakingnews #wildfire #fire #emergency #disaster #climate #climatecrisis #ClimateEmergency pic.twitter.com/ABxIK69VLd
— Attentive Media (@AttentiveCEE) August 10, 2023
Quick Update
Lahaina resembles a ghost town.
The death toll from the Hawaiian wildfires has increased to 36, according to Maui County officials.
Read more https://t.co/TJzfoFqYXj#Lahaina #Maui #Hawaii #wildfires pic.twitter.com/QnxfyLwaMu
— QuickUpdate (@BigBreakingWire) August 10, 2023
Devastation from #wildfires at #Maui are just too heartbreaking to watch💔😔 #Hawaii #MauiFires pic.twitter.com/sz8YeAT0pi
— Mario Pawlowski #ViralMario🇵🇱🇺🇦🇪🇺🇺🇸 (@PawlowskiMario) August 10, 2023
Also Read..
Mega Millions jackpot | లక్ అంటే ఇది.. లాటరీలో ఏకంగా రూ.13వేల కోట్ల జాక్పాట్..!
Crime news | మహిళను రూ.70వేలకు కొనుగోలు చేసి పెళ్లి చేసుకున్నాడు.. ఆమె ప్రవర్తన నచ్చక చంపేశాడు