గాజా: మ్యూజియంలో ఉన్న 3500 ఏళ్ల క్రితం నాటి మట్టి కుండ(Clay Jar)ను.. విజిట్‌కు వచ్చిన ఓ చిన్నారి పగలగొట్టేశాడు. ఈ ఘటన ఇజ్రాయిల్‌లోని హైఫా పట్టణంలో ఉన్న హెచ్ మ్యూజియంలో చోటుచేసుకున్నది. ఆ అరుదైన మట్టిపాత్ర 2200 నుంచి 1500 బీసీ కాలానికి చెంది ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్రాంజ్ ఏజ్‌కు చెందిన ఆ పాత్రను.. విజిటర్స్ చూసేందుకు మ్యూజియం ఎంట్రెన్స్ వద్ద అమర్చారు. అయితే ఆ పాత్రకు రక్షణగా ఎటువంటి గ్లాస్‌ను పురావాస్తుశాఖ ఫిక్స్ చేయలేదు. మట్టి కుండలో ఏముందో అని తెలుసుకునే ఆత్రుతతో తన కుమారుడు ఆ జార్‌ను లాగినట్లు తండ్రి తెలిపాడు. కానీ హెచ్ మ్యూజియం మేనేజ్మెంట్ ఈ ఘటన పట్ల సీరియస్ కాలేదు. ఆ నాలుగేళ్ల పిల్లోడితో పాటు ఫ్యామిలీని కూడా మరోసారి మ్యూజియం విజిట్‌కు రావాలని పిలిచారు. అనుకోకుండా జరిగిన ఘటన పట్ల తీవ్రమైన చర్యలు ఏమీ ఉండవని మ్యూజియం అధికారి ఒకరు తెలిపారు. వైన్, ఒలీవ్ ఆయిల్‌ను తీసుకెళ్లేందుకు ఆ జార్‌ను వాడి ఉంటారని భావిస్తున్నారు. కిండ్ డేవిడ్, కింగ్ సొలమన్ కాలంలో ఇలాంటి పాత్రలను వాడినట్లు మ్యూజియం అధికారి చెప్పారు. ఉత్తర ఇజ్రాయిల్‌లో ఉన్న హైఫా యూనివర్సిటీలో హెచ్ మ్యూజియం ఉన్నది.