గాజా: పవర్ జనరేటర్లకు ఇంధనాన్ని ఇవ్వకపోతే దవాఖానలు 48 గంటల్లో శ్మశాన వాటికలుగా మారుతాయని గాజా వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దళాల దాడుల్లో ఆదివారం 31 మంది మరణించారు, సుమారు 100 మంది గాయపడ్డారు.
దక్షిణ గాజాలో ఆహార పంపిణీ కేంద్రం సమీపంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ ఆదివారం రెండు ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరోవైపు ఖాన్ యూనిస్‌లోని కీలకమైన దవాఖాన కింద హమాస్ సొరంగాన్ని గుర్తించినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.