
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : భారత్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాలు స్నేహబంధాన్ని స్మరించుకున్నాయి. ఈ సందర్భంగా భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నోర్ గిలోన్ ఒక ప్రత్యేక వీడియోను ట్వీట్ చేశారు. ఇరు దేశాల జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ.. ఆ చిహ్నలతో 30 ఏండ్ల బంధాన్ని ఇజ్రాయెల్‌లోని మసాడా ఫోర్టిస్‌పై ప్రదర్శించారు.
భారత్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల రాయబారులు ఇటీవల వర్చువల్ పద్దతిలో సమావేమైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారి నోర్ గిలోన్ మాట్లాడుతూ.. యూరప్‌లో ఎన్నో కష్టాలు అనుభవించిన యూదులు.. భారత్‌లో మాత్రం ఎంతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై భారతీయుల్లో ఉన్న అభిమానాన్ని చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. ఇండియాలో వివక్షకు తావు లేదన్నారు. 1992, జనవరి 29న భారత్ – ఇజ్రాయెల్ దేశాలు పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయని గుర్తు చేశారు.
అనంతరం ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి సంజీవ్ సింగ్లా మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు ఉన్నాయన్నారు. భారతదేశంలో నివసిస్తున్న యూదులు ఎన్నడూ వివక్షకు గురి కాలేదని స్పష్టం చేశారు.
#WATCH | Ambassador of Israel to India Naor Gilon shared a video of the illuminated Masada Fortress in Israel to celebrate three decades of full diplomatic relations between India and Israel (29.01)
— ANI (@ANI) January 30, 2022
(Video courtesy: Naor Gilon's Twitter handle) pic.twitter.com/i9M8B4TpCH