Imran Khan | మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు 28 మంది దేశం విడిచివెళ్లకుండా నిరోధించేందుకు ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ (ECL)లో చేర్చాలని పాక్ తాత్కాలిక ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్‌పై పలు అవినీతి కేసులు నమోదైన విషయం తెలిసిందే. అల్-ఖాదిర్ ట్రస్టు కేసులో పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌తో పాటు 28 మంది పేర్లను ఈసీఎల్‌లో ఉంచాలని ఫెడరల్ కేబినెట్ సబ్‌కమిటీ సిఫారసు చేసిందని స్థానిక మీడియా పేర్కొంది. అల్ ఖదిర్ ట్రస్ట్ కుంభకోణం వ్యవహారంలో ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసులో ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో అరెస్టు చేశారు. అయితే, అరెస్టు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించి.. ఆ తర్వాత విడుదల చేశారు.
ప్రస్తుతం పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రహస్య దౌత్య పత్రాలు (సైఫర్) లీక్ చేసిన కేసులో అడియాలా జైలులో ఉన్నారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో నవంబర్ 14న నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) ఇమ్రాన్‌ను మళ్లీ అరెస్టు చేసింది. ఫెడరల్ క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశానికి తాత్కాలిక హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా తెలిపింది. చేసింది. వివిధ శాఖలు, సంస్థలు పంపిన 41 మంది పేర్లను ఈసీఎల్‌లో ఉంచాలని కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొంది. నాబ్ సిఫార్సు మేరకు, ఇమ్రాన్ ఖాన్‌తో సహా 29 మంది పేర్లను ఈసీఎల్‌లో చేర్చాలని సిఫార్సు చేసింది. ఈసీఎల్ నుంచి ఏడుగురి పేర్లను తొలగించాలని కోర్టులు డిమాండ్ చేయగా.. ఈ సిఫార్సులను ఆమోదం కోసం ఫెడరల్ కేబినెట్‌కు పంపినట్లు తెలిపింది.