బెర్లిన్: గుమిగూడిన జనంపైకి కారు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 28 మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Car drives into crowd) జర్మనీలోని మ్యూనిచ్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలో గుమిగూడి ఉన్న జనంపైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో సుమారు 28 మంది గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జనంపైకి దూసుకెళ్లిన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఒక యూనియన్ నిర్వహించిన సమ్మెలో పాల్గొన్న వారిని ఇది ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు.
కాగా, మ్యూనిచ్‌లో శుక్రవారం భద్రతా సమావేశం జరుగనున్నది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఇందులో పాల్గొనేందుకు ఇక్కడకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో జనంపైకి కారు దూసుకెళ్లిన సంఘటన కలకలం రేపింది.