వాషింగ్టన్: టెక్సాస్‌లో జరిగిన స్కూల్ కాల్పుల ఘటనలో 19 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది అమెరికాలో స్కూల్ షూటింగ్ ఘటనలు 27 జరిగినట్లు తెలస్తోంది. ఇటీవల బఫెలో నగరంలోని సూపర్మార్కెట్లో కాల్పుల ఘటన జరిగిన విషయం తెలిసిందే. అయితే అమెరికాలో 2018 సంవత్సరం నుంచి స్కూల్ షూటింగ్స్ జరుగుతన్న ఘటనల డేటాను ఎడ్యుకేషన్ వీక్ అనే సంస్థ పొందుపరుస్తోంది. ఆ సంస్థ డేటా ప్రకారం ఇప్పటి వరకు 2018 నుంచి ఆ దేశంలో 119 స్కూల్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. తూపాకీలు ఎక్కడ వాడారు, ఎవరికైనా బుల్లెట్ గాయం అయ్యిందా అన్న కోణంలో ఎడ్యుకేషన్ వీక్ సమాచారాన్ని సేకరిస్తుంది. కే-12 స్కూల్ ప్రాపర్టీల వద్ద కానీ స్కూల్ బస్సుపై జరిగే కాల్పుల ఘటనలను ఎడ్యుకేషన్ వీక్ సంస్థ సేకరిస్తుంది.
అమెరికాలో ఈ ఏడాది కాల్పుల ఘటనలు అత్యధిక స్థాయిలో నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ దేశంలో సుమారు 200 సామూహిక కాల్పుల ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ద గన్ వాయిలెన్స్ ఆర్కీవ్ దీనికి సంబంధించిన డేటాను తయారు చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 212 సామూహిక కాల్పుల ఘటనలను జరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది కాల్పుల్లో మరణిస్తే ఆ ఘటనను సామూహిక కాల్పుల ఘటనగా గుర్తిస్తారు. గన్ వాయిలెన్స్ ఆర్కివ్ ప్రకారం అమెరికాలో 2021 సంవత్సరంలో 693 సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయి. 2020లో సుమారు 611 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2019లో ఆ సంఖ్య 417గా ఉంది.