హెల్సింకీ: ఫిన్‌ల్యాండ్‌లో బ్రిడ్జ్(Footbridge collapse) కూలిన ఘటనలో 27 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఎక్కువ శాతం మంది చిన్నారులే ఉన్నారు. ఫిన్నిష్ సిటీ ఎస్పూలో ఈ ఘటన జరిగింది. పాదచారులు నడిచి వెళ్లే ఆ బ్రిడ్జ్ కూలడంతో పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్ పిల్లలే ఎక్కువ మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హెల్సింకీ హాస్పిటల్ అథారిటీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.