న్యూఢిల్లీ, మే 24 : పాకిస్థాన్‌లో సైనికులతో వెళ్తున్న రైలుపై కారుతో జరిపిన ఆత్మాహుతి దాడిలో 24 మంది మరణించగా, డజన్ల మంది గాయపడ్డారు. బలోచిస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వెట్టాలోని చమన్ పట్టక్ వద్ద రైలును బాంబులతో ఉన్న కారుతో ఉగ్రవాదులు ఢీకొట్టారు.
ఈ దాడిలో పెషావర్‌కు వెళ్తున్న పలువురు పాక్ ఆర్మీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు మరణించారు. మంగళవారం జరిగే ఈద్ వేడుకల్లో పాల్గొనేందుకు వారు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఆత్మాహుతి దాడికి తామే కారణమని బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది.