బెర్లిన్: జర్మనీలో రూ.23 వేల కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. ఏడుగురిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. డ్యుసెల్డోర్ఫ్ నగరంలోని ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ, కొలంబియా అధికారుల సమాచారం మేరకు 35.5 మెట్రిక్ టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హాంబర్గ్ పోర్టులో 25 టన్నులు, రాడర్డామ్ పోర్టులో 8 టన్నులు, కొలంబియాలో 3 టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. జర్మనీ, బల్గేరియా తదితర దేశాలకు చెందిన నిందితులు లాటిన్ అమెరికా నుంచి యూరప్ దేశాలకు గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో కొకైన్‌ను పెద్ద ఎత్తున తరలించారని చెప్పారు.