Venezuela | వెనిజులాలో ఘోర ప్రమాదం.. బంగారం గని కూలడంతో 23 మంది మృతి
Venezuela | సెంట్రల్ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
Venezuela | సెంట్రల్ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆంగోస్తురా మునిసిపాలిటీలో మంగళవారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బుల్లా లోకా అనే ప్రాంతంలోని గనిలో గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు 23 మంది మృతదేహాలను వెలికి తీశామని, మరో 11 మంది గాయపడినట్లు తెలిసిందని బొలివర్ రాష్ట్ర గవర్నర్ ఏంజెల్ మార్కానో అక్కడి మీడియాకు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించి, రక్షించాలన్నారు. సివిల్ డిఫెన్స్ బృందాలను ఇప్పటికే పంపామని తెలిపారు. బొలివర్ గవర్నర్ ఏంజెల్ మార్కానోతో మాట్లాడి, సహాయక చర్యలపై ఆరా తీసినట్లు ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
#21Feb | Cumpliendo instrucciones del Vicepdte. Sectorial AJ. @ceballosichaso1 y en coordinación con el Gob. del Edo. Bolívar Ángel Marcano, funcionarios del SNGR junto a Organismos de Seguridad ciudadana y efectivos de la ZODI Bolívar, realizan Operaciones de Salvamento… pic.twitter.com/6FWE5SiE22
— cperezampueda (@cperezampueda) February 21, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

