వెనెజులాలో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి
Venezuela | దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజధాని కారకాస్‌కు 67 కిలోమీటర్ల
కారకస్: దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజధాని కారకాస్‌కు 67 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాస్ టెజెరస్‌లో కొండచరియలు విరిగిపడి 22 మంది మృతిచెందారు. మరో 52 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 22 మంది చనిపోయారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని దేశ ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. మృతుల సంఖ్య మరిత పెరిగే అవకాశముందని చెప్పారు. నగరంలోని ఇండ్లు, వ్యాపార సముదాయాలు పెద్ద సంఖ్యలో నేలమట్టమయ్యాయని తెలిపారు. వీధులు మొత్తం బురదతో నిండిపోయాయని వెల్లడించారు. నెలరోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్కరోజులోనే పడటంతో నష్టం భారీగా జరిగిందని చెప్పారు.

లాస్ టెజెరాస్ ఘటనపై వెనెజులా అధ్యక్షుడు నికోలస్ ముదురో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని ఉపాధ్యక్షుడితోపాటు మంత్రివర్గ సహచరులకు ఆదేశాలు జారీచేశారు.
Frente a la difícil y dolorosa situación ocasionada por las fuertes lluvias en Las Tejerías, ordené a la Vicepresidenta @delcyrodriguezv, al Gabinete Social y a todos los organismos de seguridad, el máximo despliegue para la atención integral del pueblo. ¡No están solos! pic.twitter.com/LlKNaUQC1Z
— Nicolás Maduro (@NicolasMaduro) October 9, 2022
కాగా, వెనెజులాలో గత వారం రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 23 రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. ఐదు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా, దేశంలో గత 30 ఏండ్లలో కొండచరియలు విరిగిపడి 22 మంది మరణించడం ఇదే మొదటిసారి.


Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

