Nobel Prize: రోగనిరోధక వ్యవస్థలో ‘టీ కణాల’పై అధ్యయనం.. ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం
2025 Nobel Prize in Medicine: రోగనిరోధక వ్యవస్థలో సెక్యూర్టీ గార్డుల్లా పనిచేస్తున్న రెగ్యులేటరీ టీ కణాలను గుర్తించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్యశాస్త్రంలో 2025 నోబెల్ పురస్కారం దక్కింది. మేరీ బ్రుంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమోన్ సకగుచిలకు సంయుక్తంగా ఆ అవార్డుకు ఎంపికయ్యారు. ఆటోఇమ్యూన్ వ్యాధులు రాకుండా నిలువరిస్తున్న ఆ టీ కణాలపై లోతుగా ఈ శాస్త్రవేత్తలు స్టడీ చేశారు.
స్టాక్‌హోమ్: వైద్య శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ యేటి నోబెల్ పురస్కారం(Nobel Prize 2025) దక్కింది. మేరీ ఈ బ్రుంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమోన్ సాకగుచి నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు రోగనిరోధక శక్తికి సంబంధించిన కీలక ఆవిష్కరణలను చేసినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయోలజీలో మేరీ బ్రుంకోవ్ పనిచేస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న సోనోమా బయోథెరపాటిక్స్‌లో ఫ్రెడ్ రామ్స్డెల్ చేస్తున్నారు. జపాన్‌లోని ఓసాకాలో ఉన్న ఓసాకా యూనివర్సిటీలో షిమోన్ సకగుచి విధులు నిర్వర్తిస్తున్నారు.
రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న అంశంలో ముగ్గురు పరిశోధకులు కీలక విషయాలను గుర్తించారు. శరీరంలోని అత్యంత శక్తివంతమైన రోగనిరోధక వ్యవస్థను నియంత్రించాల్సి ఉంటుందని, లేదంటే ఆ వ్యవస్థ మన శరీర అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని దెబ్బతీయకుండా ఉండే పెరిఫరల్ ఇమ్యూన్ టాలరెన్స్ గురించి ముగ్గురు శాస్త్రవేత్తలు స్టడీ చేసినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది.
రోగనిరోధక వ్యవస్థలో సెక్యూర్టీ గార్డుల్లా పనిచేస్తున్న రెగ్యులేటరీ టీ కణాల గురించి శాస్త్రవేత్తలు ఆవిష్కరణ చేశారు. ఈ టీ కణాలు మన శరీరంపై ఇమ్యూన్ కణాలు దాడి చేయకుండా నివారిస్తాయని గుర్తించారు. టీ కణాల అధ్యయనం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ పనితీరు విధానం అర్థమవుతుందని, దీని వల్ల ఆటోఇమ్యూన్ వ్యాధులు ఎందుకు డెవలప్ కావడం లేదన్న విషయం తెలుస్తుందని నోబెల్ కమిటీ చైర్ ఓల్లీ కాంపె తన ప్రకటనలో తెలిపారు.
BREAKING NEWS
The 2025 #NobelPrize in Physiology or Medicine has been awarded to Mary E. Brunkow, Fred Ramsdell and Shimon Sakaguchi “for their discoveries concerning peripheral immune tolerance.” pic.twitter.com/nhjxJSoZEr— The Nobel Prize (@NobelPrize) October 6, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

